నాగ్‌పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది.
బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు.


