అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు.. రిజ్వాన్‌ పేరు చెరిపేసి.. | Austria Batter Breaks Mohammad Rizwan T20I World Record Becomes | Sakshi
Sakshi News home page

టీ20 ఫార్మాట్లో ప్రపంచ రికార్డు.. రిజ్వాన్‌ పేరు చెరిపేసిన ‘అనామక’ బ్యాటర్‌!

Oct 23 2025 5:47 PM | Updated on Oct 23 2025 5:57 PM

Austria Batter Breaks Mohammad Rizwan T20I World Record Becomes

కరణ్‌బీర్‌ సింగ్‌ (PC: X)

ఆస్ట్రియా బ్యాటర్‌ కరణ్‌బీర్‌ సింగ్‌ (Karanbir Singh) అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు.

ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (Mohammad Rizwan) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కరణ్‌బీర్‌ సింగ్‌ బద్దలు కొట్టాడు. రొమేనియా పర్యటన సందర్భంగా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సందర్భంగా కరణ్‌బీర్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 57 పరుగులు రాబట్టిన కరణ్‌బీర్‌.. రెండో మ్యాచ్‌లో 46 బంతుల్లోనే 90 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఈ క్రమంలోనే రిజ్వాన్‌ను అధిగమించిన కరణ్‌బీర్‌ సింగ్‌.. ఆ తర్వాత కూడా తన ప్రభంజనం కొనసాగించాడు. రొమేనియా టూర్‌లో మూడో మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 74 పరుగులు సాధించిన ఈ ఆస్ట్రియా బ్యాటర్‌.. తదుపరి 12 బంతుల్లో 27 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఈ ఏడాదిలో 1488 పరుగుల మార్కును అందుకున్నాడు.

ఇక రొమేనియాతో సిరీస్‌లో కరణ్‌బీర్‌ సింగ్‌ ఏకంగా 19 ఫోర్లు బాదాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఓవరాల్‌గా 127 ఫోర్లు నమోదు చేశాడు. అంతేకాదు.. అతడి ఖాతాలో 122 సిక్సర్లు కూడా ఉన్నాయి.

వెయ్యి పరుగుల మైలురాయి దాటిన మరో బ్యాటర్‌
రొమేనియాతో మొయేరా వ్లాసే క్రికెట్‌ గ్రౌండ్లో జరిగిన నాలుగో టీ20లో కరణ్‌బీర్‌తో పాటు.. అతడి సహచర ఆటగాడు బిలాల్‌ జల్మాయి కూడా అదరగొట్టాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. 

ఇక ఆస్ట్రియా రొమేనియా టూర్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కరణ్‌బీర్‌ విధ్వంసం కూడా కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. అసోసియేట్‌ జట్లకు చెందిన ఈ ఆటగాళ్లు ఇంతలా విజృంభించడం జట్లబంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటూ పొట్టి క్రికెట్‌ అభిమానులు మురిసిపోతున్నారు.

పురుషుల అంతర్జాతీయ టీ20లలో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
🏏కరణ్‌బీర్‌ సింగ్‌ (ఆస్ట్రియా)- 2025లో 32 ఇన్నింగ్స్‌ ఆడి 1488*
🏏మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌)- 2021లో 26 ఇన్నింగ్స్‌ ఆడి 1326
🏏సూర్యకుమార్‌ యాదవ్‌ (ఇండియా)- 2022లో 31 ఇన్నింగ్స్‌ ఆడి 1164
🏏బిలాల్‌ జల్మాయి (ఆస్ట్రియా)- 2025లో 35 ఇన్నింగ్స్‌లో 1008*
🏏మొహమ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌)- 2022లో 25 ఇన్నింగ్స్‌ ఆడి 996.

చదవండి: బతికితే చాలనుకున్నా.. ఆకాశ్‌ అంబానీ హెల్ప్‌ చేశారు: తిలక్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement