
హిట్‌మాన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ సలహా పాటించానంటున్నాడు టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఆ సలహా పాటించడం వలన తనకు మంచే జరిగిందంటున్నాడు స్కై. ఇంతకీ ఏ విషయంలో ఆమె సలహా పాటించాడో తెలుసా?
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఉత్కంఠపోరులో గెలిచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కైవసం చేసుకోవడంతో మెన్ ఇన్ బ్లూ పిచ్చ హ్యాపీ మూడ్‌లో ఉంది. సిరీస్ ఆరంభం నుంచి చివరి వరకు సమిష్టిగా రాణించి కప్ అందుకోవడంతో బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ కూడా సూర్య సేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగతంగా విఫలమైనప్పటికీ జట్టును విజేతగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు సూర్య. పదునైన వ్యూహాలతో మైదానంలో జట్టును ముందుండి నడిపించి విజయపథంలో నిలిపాడు. హ్యాండ్‌షేక్ లేని సంఘటన నుంచి చివరి రోజు ట్రోఫీ లేని వేడుకల వరకు వరుస వివాదాలు నడుమ కూల్‌గా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. పాకిస్థాన్ జట్టుతో వ్యవహరించిన తీరుతో టీమిండియా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.
అదే ఫాలో అవుతున్నా
తాను కూల్‌గా ఉండటానికి రోహిత్ శర్మ వైఫ్ రితిక ఇచ్చిన సలహా ఉపయోగపడిందని సూర్యకుమార్ వెల్లడించాడు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అతడు మాట్లాడుతూ.. మేజర్ టోర్నమెంట్లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ సోషల్ మీడియాకు (Social Media) దూరంగా ఉంటాడని రితిక చెప్పిందని తెలిపాడు. తాను కూడా అదే ఫాలో అవుతున్నానని చెప్పాడు. ఆసియాకప్ ఆడటానికి ముందు తన ఫోన్‌లోని సోషల్ మీడియా యాప్స్ అన్ని తొలగించినట్టు రివీల్ చేశాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ప్రశాంతత లభించడంతో పాటు డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అయిందన్నాడు.
ఆ యాప్స్ తీసేశా
'ఆసియాకప్ ఆడేందుకు దుబాయ్ రావడానికి ముందు నా ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ యాప్స్ డిలీట్ చేశాను. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ఒకటే ఉంచాను. మన ఫోన్‌లో సోషల్ మీడియా యాప్స్ ఉంటే అందులో వచ్చే మెసేజ్‌లు అన్ని చూడాలనిపిస్తుంటుంది. మెగా టోర్నమెంట్‌లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని రితిక చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. రోహిత్ తన ఫోన్‌లోని యాప్స్ తొలగిస్తాడని ఆమె చెప్పింది. దీన్ని నేను కూడా ఫాలో అవుతున్నాడు. దీనివల్ల నాకు మంచే జరిగింద'ని సూర్యకుమార్ చెప్పాడు.
చదవండి: మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం