
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌తో జరిగే తొలి మ్యాచ్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. గాయం కారణంగా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
బీసీసీఐ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావడంతో సర్ఫరాజ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే టీమిండియా టీ20 కెప్టెన్, ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుండడంతో జమ్మూతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.
మహారాష్ట్రతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ గేమ్‌లో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లు ఈ 16 మంది సభ్యుల జట్టులో ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్‌కు ముందు ముంబై కెప్టెన్ పదవికి రాజీనామా చేసిన అజింక్య రహానె కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. జమ్మూతో మ్యాచ్‌కు ముంబై సెలక్టర్లు బలమైన జట్టును ప్రకటించారు.
సీనియర్ ఆటగాళ్లతో పాటు అయూష్ మాత్రే, తనీష్ కొటియన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా భారత టీ20 స్టార్ శివమ్ దూబే సైతం జమ్మూతో మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. కానీ తొలి మ్యాచ్‌లో దూబే ఆడుతాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో దూబే భాగంగా ఉన్నాడు. కాగా రాబోయో రంజీ ట్రోఫీ సీజన్‌లో అక్టోబర్ 15-18 వరకు శ్రీనగర్ వేదికగా ముంబై, జమ్మూ కాశ్మీర్ జట్లు తలపడనున్నాయి.
జమ్మూతో మ్యాచ్‌కు ముంబై జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, ఆకాశ్ ఆనంద్ (వికెట్ కీపర్), అజింక్యా రహానే, సిద్ధేష్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే, సిల్వెస్టర్ డిసౌజా, హార్దిక్ తమోర్ , ఇర్ఫాన్ ఉమీర్, ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, రాయ్‌స్టన్ డయాస్
చదవండి: 'మీ అన్నయ్య లాంటి వాడిని'.. ముషీర్‌కు సారీ చెప్పిన పృథ్వీ షా