న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. రాయ్‌పూర్ వేదికగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
ఆడతాడా? లేదా?
నాగ్‌పూర్‌లో కివీస్‌తో తొలి టీ20 సందర్భంగా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injured) గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడగా.. బంతిని ఆపే క్రమంలో అక్షర్ ఎడమచేతికి గాయమైంది. చూపుడు వేలు చిట్లి రక్తం వచ్చింది. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు.
అయితే, అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో కివీస్‌తో రెండో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్నది తేలలేదు. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ ఆల్‌రౌండర్ అక్షర్ స్థానాన్ని.. మరో లెఫ్టాండర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భర్తీ చేసే అవకాశం ఉంది.
కుల్దీప్ వైపు మొగ్గు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కుల్దీప్ యాదవ్ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో అతడికి అపార అనుభవం ఉంది. కాబట్టిరవి బిష్ణోయిని కాదని కుల్దీప్ వైపు యాజమాన్యం మొగ్గుచూపవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
బ్రేస్‌వెల్ వస్తాడా?
కాగా కుల్దీప్ యాదవ్ ఇప్పటికి టీమిండియా తరఫున 50 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అతడు తుదిజట్టులోకి వస్తే యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్‌పై వేటు పడే అవకాశం ఉంది.
ఇక రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్‌పూర్‌లో 48 పరుగులు తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 తుదిజట్లు అంచనా
భారత్
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, క్రిస్టియన్ క్లార్క్/ మైకేల్ బ్రేస్‌వెల్, కైలీ జేమీసన్, ఇష్ సోధి, జేకబ్ డఫీ.
చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు


