
PC: BCCI/IPL.com
ఎంఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు. ఈ జార్ఖండ్ డైన్‌మేట్.. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు అద్బుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్‌కు పెట్టింది పేరు. తాజాగా ధోని మరోసారి తన కీపింగ్ స్కిల్స్‌తో అభిమానులను అలరించాడు.
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తరపున ఆడుతున్న ధోని.. అద్బుతమైన స్టంపింగ్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను మెరుపు స్టంప్ ఔట్ చేసి ధోని పెవిలియన్‌కు పంపిచాడు.
అసలేమి జరిగిదంటే?
ముంబై ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ నూర్ అహ్మద్.. మూడో బంతిని సూర్యకు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సూర్యకుమార్ క్రీజు నంచి బయటకు వచ్చి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అద్భుతంగా టర్న్ అయ్యి అతడి బ్యాట్‌ను మిస్ అయ్యి వికెట్ల వెనక ఉన్న ధోని చేతికి వెళ్లింది.
ఈ క్రమంలో మిస్టర్ కూల్.. తన వింటేజ్ స్టైల్‌లో రెప్పపాటులో బెయిల్స్‌ను పడగొట్టాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేసినప్పటికి.. సూర్య మాత్రం కనీసం వెనక్కి తిరగకుండా మైదానం విడిచివెళ్లిపోయాడు. ధోని కేవలం 0.12 సెకండ్ల వ్యవధిలోనే స్టంప్ ఔట్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.
𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡
📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8— IndianPremierLeague (@IPL) March 23, 2025