Australia vs India, 5th T20I Updates: టీమిండియా- ఆస్ట్రేలియా నిర్ణయాత్మక ఐదో టీ20లో తలపడుతున్నాయి. బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.
👉గబ్బాలో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడం మరింత సమయం పట్టే అవకాశముంది
ఆగిన ఆట.. భారత్ స్కోరెంతంటే?
4.5 ఓవర్ల వద్ద వాతావరణ మార్పు కారణంగా భారత్ బ్యాటింగ్ నిలిచిపోయింది. మెరుపులు, వాన మొదలుకావడంతో ఆట నిలిపివేశారు. ఇక ఆట ఆగే సరికి టీమిండియా స్కోరు: 52-0. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.
గిల్ ధనాధన్
మూడు ఓవర్లు ముగిసే సరికి భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ ఆరు బంతుల్లో 9, గిల్ 12 బంతుల్లో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్లో గిల్ డ్వార్షుయిస్ బౌలింగ్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదడం విశేషం.
తిలక్ వర్మకు విశ్రాంతి
ఇక నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ తమ తుదిజట్టులో కీలక మార్పు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు విశ్రాంతినిచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా నాలుగో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ రెండు గెలవగా.. ఆసీస్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. ఫలితంగా 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా గాబాలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదో టీ20 తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా.


