గతేడాది టీ20 ఫార్మాట్లో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మెజారిటీ ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు ఆసియా టీ20 కప్-2025 టైటిల్ కూడా గెలిచింది.
అయితే, బ్యాటర్‌గా మాత్రం సూర్య (Suryakumar Yadav) వరుస వైఫల్యాలతో చతికిలపడ్డాడు. దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగిన ఈ ముంబైకర్.. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ముందు ఈ అంశం టీమిండియాను కలవరపెడుతోంది.
సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే..
ఈ విషయంపై టీమిండియా దిగ్గజ బ్యాటర్, టీ20 ప్రపంచకప్-2024లో భారత్‌కు టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. సూర్య గనుక ఫామ్‌లోకి రాకపోతే జట్టుకు కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ..
అతడే ప్రధాన బ్యాటింగ్ ‘పవర్’
‘‘కెప్టెన్ ఫామ్‌లో ఉన్నాడా? లేదా? అన్నది ఇక్కడ సమస్య కాదు. ఒక ఆటగాడు ఫామ్‌లో లేకుంటే.. మనకు ఏడు నుంచి ఎనిమిది మంది బ్యాటర్లు అందుబాటులో ఉంటారు. అయితే, మనకున్న ప్రధాన బ్యాటింగ్ ‘పవర్’ తడబాటుకు లోనైతే పరిస్థితి కఠినంగా మారుతుంది.
ప్రణాళికలు, వ్యూహాలను పక్కాగా అమలు చేయడం వీలుకాదు. అనుకున్నంత ప్రభావం చూపలేకపోవచ్చు. ఒకవేళ సూర్య గనుక సరిగ్గా ఆడకపోతే.. బ్యాటింగ్ లైనప్ కచ్చితంగా ఇబ్బంది పడుతుంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కెప్టెన్సీపై ప్రశంసలు
అయితే, కెప్టెన్‌గా మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కు వంక పెట్టేందుకు ఏమీ లేదని రోహిత్ శర్మ ప్రశంసించాడు. ‘‘ఆట పట్ల సూర్యకు మంచి అవగాహన ఉంది. తన జట్టులోని ఆటగాళ్లలో అత్యుత్తమం ఎవరన్నది అతడికి బాగా తెలుసు. వారి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో కూడా అతడికి తెలుసు’’ అని సూర్య కెప్టెన్సీని కొనియాడాడు.
రోహిత్ స్థానంలో
కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
ఈ క్రమంలో రోహిత్ స్థానంలో టీ20 పగ్గాలు చేపట్టిన సూర్య వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 జరుగనుండగా.. చివరి సన్నాహకంగా భారత్ న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు ఆడేందుకు సిద్ధమైంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్!
“SKY knows the game. He knows the players.” 💙@ImRo45 highlights @surya_14kumar's form and impact, calling him a critical batter whose presence brings balance and confidence to India’s batting lineup. 🔑🔥
Why is SKY central to India’s success on the biggest stage? 🤔
Watch it… pic.twitter.com/JEXFzIPhWA— Star Sports (@StarSportsIndia) January 20, 2026


