టీమిండియాతో టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ హ్యాట్రిక్ విజయాలతో 3-0తో కివీస్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తమకు మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు సంబంధించి తమ జట్టులో కీలక మార్పులు చేసింది.
ఆ ఇద్దరిపై వేటు
యువ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్‌తో పాటు టాపార్డర్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్‌లను జట్టు నుంచి తొలగించిన కివీస్. వారి స్థానాల్లో జేమ్స్ నీషమ్, లాకీ ఫెర్గూసన్‌లను జట్టులోకి తీసుకువచ్చింది.
అదే విధంగా టిమ్ సీఫర్ట్ కూడా జట్టుతో చేరినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక ఐదో టీ20 కోసం టాపార్డర్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా జట్టుతో చేరతాడని బ్లాక్‌క్యాప్స్ తెలిపింది.
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్‌కు వచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ 2-1తో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించిన కివీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం వరుస వైఫల్యాలతో ఓటమిపాలైంది. ఇక భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాలుగో టీ20, శనివారం ఐదో టీ20 జరుగనున్నాయి. ఇందుకు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలు.
భారత్‌తో మిగిలిన రెండు టీ20లకు న్యూజిలాండ్ జట్టు (అప్‌డేటెడ్)
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జేకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జెమీసన్, మైకేల్ బ్రేస్‌వెల్, బెవాన్ జేకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!


