
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 17 మందితో సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు చరిత్ అసలంక(Charith Asalanka) సారథ్యం వహించనున్నాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్లు దసున్ షనక(Dasun Shanaka), చమిక కరుణరత్నేలకు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.
అదేవిధంగా యువ పేసర్ ఎషాన్ మలింగకు తొలిసారి లంక టీ20 జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్, సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో మలింగ అద్బుతమైన ప్రదర్శనతో సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు టీ20 జట్టులోకి తీసుకున్నారు.
మలింగకు డెత్‌లో బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఇక ఈ జట్టులో కెప్టెన్ అసలంకతో కుశాల్ మెండిస్, నిస్సాంక, కమిందు మెండిస్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మతీషా పతిరాన, వానిండు హసరంగా, నువాన్ తుషారా వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు.
కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్‌కప్-2026 సన్నాహాల్లో భాగంగా జరగనుంది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జూలై 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు శ్రీలంక, భారత్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక, బంగ్లా జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే పల్లెకలే వేదికగా మంగళవారం జరుగుతోంది.
బంగ్లాతో టీ20 సిరీస్‌కు శ్రీలంక జట్టు
చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, దినేష్ చండిమల్, కుసల్ పెరీరా, కమిందు మెండిస్, అవిష్క ఫెర్నాండో, దసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వందేర్సే, చమిక కరుణరత్నే, మతీషా పతిరనా, నువాన్ తుషార, బినుర ఫెర్నాండో, ఎషాన్ మలింగ.
చదవండి: అతడు కోహ్లి, టెండుల్కర్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు: ఇంగ్లండ్ మాజీ బ్యాటర్