న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.
మొత్తంగా రెండు వికెట్లు
ఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.
వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్‌రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
మురళీ కార్తిక్‌తో గొడవ?
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.
ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
🚨 Hardik Pandya angry at Murali Kartik
– Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026


