breaking news
Murali Karthik
-
మాజీ క్రికెటర్‌తో హార్దిక్ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్‌తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్‌పూర్‌లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్‌రౌండర్‌కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్‌రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్‌తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్‌తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్‌తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026 -
అతడు ఫిట్‌గానే ఉన్నాడు కదా.. అన్షుల్‌ను ఎలా తీసుకున్నారు?
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయపడ్డ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) స్థానాన్ని సీనియర్ శార్దూల్ ఠాకూర్‌తో భర్తీ చేసిన యాజమాన్యం.. ఆకాశ్ దీప్ స్థానంలో అన్షుల్ కంబోజ్ను అరంగేట్రం చేయించింది.కరుణ్‌పై వేటుఇక వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)పై వేటు వేసిన సెలక్టర్లు.. తొలి టెస్టులో ఆడిన సాయి సుదర్శన్‌ను మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేర్చారు. అయితే, ఈ తుదిజట్టు కూర్పుపై భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ విమర్శలు గుప్పించాడు. ఏ ప్రాతిపదికన అన్షుల్ కంబోజ్‌కు అవకాశం ఇచ్చారని ప్రశ్నించాడు.క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు. ఆకాశ్ దీప్ ఆడటం లేదు కాబట్టి.. అన్షుల్ కంబోజ్ అరంగేట్రం చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ పునరాగమనం కూడా ఆసక్తికరమే.ప్రసిద్ ఫిట్‌గా ఉన్నాడుయువ పేసర్ ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) మిగిలిన రెండు మ్యాచ్‌లు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అయినప్పటికీ.. అకస్మాత్తుగా అతడిని పక్కనపెట్టారు. తుదిజట్టులో అతడికి స్థానం దక్కలేదు.అన్షుల్ అరంగేట్రం ఎలా సాధ్యం?నిజానికి అన్షుల్ కంబోజ్ మొదటి నుంచి జట్టులో భాగమే కాదు. అతడి కంటే ముందు హర్షిత్ రాణా జట్టులో ఉన్నాడు. కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. కొత్తగా వచ్చిన అన్షుల్ అరంగేట్రం చేశాడు.అసలు మేనేజ్మెంట్ ఆలోచన ఎలా ఉందో.. వారు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అంటూ మురళీ కార్తిక్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.సాయి సుదర్శన్‌పై ప్రశంసలుఅదే విధంగా.. సాయి సుదర్శన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తొలి రోజు ఆటలో అతడే హైలైట్. అతడు క్రీజులో ఉన్నపుడు వికెట్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేమీ లేదు. అయినా సరే సాయి అదరగొట్టాడు. అందుకే అతడు ప్రశంసలకు అర్హుడు’’ అని మురళీ కార్తిక్ కొనియాడాడు.తొలిరోజు మెరుగ్గానేకాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికి మూడు టెస్టులు పూర్తయ్యాయి. ఇంగ్లండ్ రెండు గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉండగా... మాంచెస్టర్‌లో బుధవారం మొదలైన నాలుగో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (46) రాణించగా.. సాయి సుదర్శన్ అద్భుత అర్ధ శతకం(61)తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. రిషభ్ పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా 19, శార్దూల్ ఠాకూర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్


