ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. టీ20 సిరీస్ మ‌న‌దే | India Wins T20 Series Against Australia 2-1 After Fifth Match Is Abandoned Due To Rain, More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs AUS: ప్ర‌తీకారం తీర్చుకున్న భార‌త్‌.. టీ20 సిరీస్ మ‌న‌దే

Nov 8 2025 4:47 PM | Updated on Nov 8 2025 4:58 PM

IND Vs AUS 5th T20: Rain Plays Spoilsport As The Brisbane Clash Ends In No Result

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు అందుకు ప్రతీకారం తీర్చుకుంది.  శనివారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌-భారత్ మధ్య జరుగుతోన్న ఐదో టీ20 వర్షం కారణంగా అర్ధంతరంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.

తొలి టీ20 కూడా వర్షార్పణం కాగా.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్ ఘన విజయం సాధించింది. అనంతరం మూడు, నాలుగు టీ20ల్లో కంగారులను చేసిన భారత జట్టు.. సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది. ఆ తర్వాత కీలకమైన ఐదో టీ20 రద్దు కావడంతో సిరీస్ భారత్ కైవసమైంది. 

చివరి మ్యాచ్‌లో ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. తొలుత ఉరుములు, మెరుపులు రావడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత భారీ వర్షం కూడా తోడవడంతో మ్యాచ్‌ను అంపైర్‌లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్ అసాంతం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌రిచాడు. నాలుగు మ్యాచ్‌ల‌లో 159.09 స్ట్రైక్ రేటుతో 140 ప‌రుగులు చేశాడు. కాగా అంత‌కుముందు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో మార్ష్ సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ధ్రువ్ జురెల్ సూప‌ర్ సెంచ‌రీ.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement