
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఆసీస్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ప్రకటించింది.
ఈ మ్యాచ్‌తో యువ సంచలనం, విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ ఆసీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో ఓవెన్‌కు చోటు దక్కింది. ఓవెన్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు.
బిగ్‌బాష్ లీగ్ 2024-25 సీజన్‌లో లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
కానీ ఇటీవల జరిగిన మేజర్ లీగ్ టీ20 క్రికెట్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఓవెన్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20కు మాథ్యూ షార్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు.
అతడి స్దానంలో ఫ్రేజర్ మెక్‌గర్క్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 సీజన్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ కూడా తిరిగి ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. కాగా ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యారు.
విండీస్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచ్ ఓవెన్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా
చదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై