breaking news
Mitchell Owen
-
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్‌గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌లోకి రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్‌లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్ అయ్యర్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్ కమిన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు -
Aus vs SA: వన్డే, టీ20లకు ఆసీస్ జట్టు ప్రకటన.. కమిన్స్, స్టార్క్ లేకుండానే..
సౌతాఫ్రికాతో వన్డే, టీ20 (Aus vs SA)లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉండనుండగా.. టీ20 సారథి మిచెల్ మార్ష్ వన్డే జట్టుకూ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.తొలిసారి వన్డే జట్టులోవెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న విధ్వంసకర వీరుడు ట్రవిస్ హెడ్‌తో పాటు పేసర్ జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నారు. ఇక విండీస్ టూర్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిచెల్ ఓవెన్.. వన్డే జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్నాడు.వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో ఓవెన్ 192కు పైగా స్ట్రైక్‌రేటుతో 125 పరుగులు సాధించాడు. దీంతో సెలక్టర్లు అతడిని వన్డే టీమ్‌కు ఎంపిక చేశారు. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ రిటైర్మెంట్ల నేపథ్యంలో మిడిలార్డర్లో ఖాళీ అయిన స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు.లబుషేన్‌కు అవకాశంమరోవైపు.. పేసర్ లాన్స్ మోరిస్ కూడా వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక ఇటీవల టెస్టుల్లో పేలవ ప్రదర్శనతో ఉద్వాసనకు గురైన మార్నస్ లబుషేన్ వన్డేల్లో మాత్రం స్థానం సంపాదించాడు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ కమిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్లపై పనిభారం తగ్గించే దృష్ట్యా మేనేజ్మెంట్ వారిద్దరికి విశ్రాంతినిచ్చింది.ఇక టీ20 జట్టుకు పద్నాలుగు మంది ఆటగాళ్లనే ఎంపిక చేసిన సెలక్టర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, కూపర్ కన్నోలి, జేవియర్ బార్ట్లెట్లపై వేటు వేసింది. అయితే వీరిలో బార్ట్లెట్ వన్డే జట్టులో మాత్రం స్థానం దక్కించుకోగలిగాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా చివరగా వన్డే మ్యాచ్ ఆడింది. టీమిండియా చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇక ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా.. టీ20 సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20లలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది. ఇక తదుపరి స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.సౌతాఫ్రికాతో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.సౌతాఫ్రికాతో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, లాన్స్ మోరిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా షెడ్యూల్టీ20 సిరీస్👉తొలి టీ20: ఆగష్టు 10- డార్విన్👉రెండో టీ20: ఆగష్టు 12- డార్విన్👉మూడో టీ20: ఆగష్టు 16- కైర్న్స్వన్డే సిరీస్👉తొలి వన్డే: ఆగష్టు 19- కైర్న్స్👉రెండో వన్డే:ఆగష్టు 22- మెకాయ్👉మూడో వన్డే: ఆగష్టు 24- మెకాయ్.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా -
అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు
వెస్టిండీస్‌తో తొలి టీ20 (WI vs AUS)లో ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. జమైకా వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది.హోప్, చేజ్ హాఫ్ సెంచరీలుటెస్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన కంగారూలు.. టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేశారు. సబీనా పార్కులో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆదిలోనే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (18) వికెట్ కోల్పోయింది.అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ షాయీ హోప్ (39 బంతుల్లో 55), వన్‌డౌన్ బ్యాటర్ రోస్టన్ చేజ్ (60) అర్ధ శతకాలతో రాణించారు. షిమ్రన్ హెట్మెయిర్ (19 బంతుల్లో 38) తనదైన శైలిలో ధనాధన్ దంచికొట్టగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ ఎనిమిది వికట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.5️⃣0️⃣ for Roston in some style!🏏💥#WIvAUS | #fullahenergy pic.twitter.com/J9JygS3XcC— Windies Cricket (@windiescricket) July 21, 2025ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సీన్ అబాట్, కూపర్ కన్నోలి, నాథన్ ఎల్లిస్, అరంగేట్ర ప్లేయర్ మిచెల్ ఓవెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన మార్ష్ బృందం 18.5 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది.గ్రీన్, మిచ్ మెరుపు హాఫ్ సెంచరీలుకెప్టెన్ మిచెల్ మార్ష్ (24) ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ (2), వన్‌డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ (18) నిరాశపరిచారు. గ్లెన్ మాక్స్వెల్ (11) సైతం విఫలం కాగా.. కామెరాన్ గ్రీన్, మిచెల్ ఓవెన్ మెరుపు అర్ధ శతకాలతో చెలరేగారు. గ్రీన్ 26 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేయగా.. మిచెల్ ఓవెన్ 27 బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 50 పరుగులు సాధించాడు.మిగతా వారిలో కూపర్ కన్నోలి 13 పరుగులు చేయగా.. డ్వార్షుయిస్ (5), సీన్ అబాట్ (5) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. విండీస్‌పై మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.పంజాబ్ కింగ్స్ప్లేయర్గాకాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన మిచెల్ ఓవెన్.. విండీస్‌తో తొలి టీ20 ద్వారా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడం విశేషం. అంతేకాదు.. ఆసీస్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా మిచ్ నిలిచాడు. చదవండి: నితీశ్ రెడ్డి అవుట్! -
ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ ప్లేయర్ అరంగేట్రం
మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఆసీస్-వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం(జూలై 20) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆస్ట్రేలియా మెనెజ్‌మెంట్ ప్రకటించింది.ఈ మ్యాచ్‌తో యువ సంచలనం, విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ ఆసీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20 కోసం ఎంపిక చేసిన తుది జట్టులో ఓవెన్‌కు చోటు దక్కింది. ఓవెన్ గత కొంత కాలంగా టీ20 క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు.బిగ్‌బాష్ లీగ్ 2024-25 సీజన్లో లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ఎంట్రీ ఇచ్చినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కానీ ఇటీవల జరిగిన మేజర్ లీగ్ టీ20 క్రికెట్లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఓవెన్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. తొలి టీ20కు మాథ్యూ షార్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు.అతడి స్దానంలో ఫ్రేజర్ మెక్‌గర్క్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా ఐపీఎల్-2025 సీజన్లో గాయపడ్డ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ కూడా తిరిగి ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. కాగా ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యారు.విండీస్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాచదవండి: #Karun Nair: అనుకున్నదే జరిగింది.. కరుణ్ నాయర్ గుడ్‌బై -
5 వికెట్లతో చెలరేగిన ఆసీస్ యువ సంచలనం.. ప్లే ఆఫ్స్‌కు మాక్స్వెల్ టీమ్
మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు ప్లేఆఫ్స్‌కు ఆర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం డల్లాస్ వేదికగా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించిన వాషింగ్టన్.. తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58), జాక్ ఎడ్వార్డ్స్ (42), పియెనార్(30) రాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో బౌలర్లలో జేవియర్ బెర్ట్‌లెట్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. హారీస్ రవూఫ్, షెఫర్డ్ తలా వికెట్ సాధించారు.ఐదేసిన ఓవెన్..ఇక బ్యాటింగ్‌లో విఫలమైన వాషింగ్టన్ స్టార్ ఆల్‌రౌండర్, ఆసీస్ యువ సంచలనం మిచెల్ ఓవెన్ (Mitchell Owen) బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి ఓటమిని శాసించాడు. లక్ష్య చేధనలో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 157 పరుగులకు పరిమితమైంది.వాషింగ్టన్ బౌలర్లలో ఓవెన్‌తో పాటు రచిన్ రవీంద్ర, ఎడ్వర్డ్స్,హోలండ్ తలా వికెట్ సాధించారు. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాటర్లలో కెప్టెన్ మాథ్యూ షార్ట్ (67; 40 బంతుల్లో) మాత్రమే రాణించాడు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఇప్పటికే తమ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మరో రెండు స్ధానాల కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్, సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మధ్య పోటీనెలకొంది.చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు -
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్ సేన
మేజర్ లీగ్ క్రికెట్ 2025 ఎడిషన్‌లో భాగంగా టెక్సాస్ కింగ్స్‌తో ఇవాళ (జూన్ 23) జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడం ఆటగాడు, పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలుత బౌలింగ్‌లో (3-0-33-3) రెచ్చిపోయిన ఓవెన్.. ఆతర్వాత బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించాడు (52 బంతుల్లో 89; 8 ఫోర్లు, 5 సిక్సర్లు). ఫలితంగా ఓవెన్ ప్రాతినిథ్యం వహించిన వాషింగ్టన్ ఫ్రీడం మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అతి భారీ లక్ష్య ఛేదనను (223/3) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓవెన్ ఆండ్రియస్ గౌస్‌తో (45 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఓవెన్, గౌస్ కలిసి వాషింగ్టన్ ఫ్రీడంకు చారిత్రక విజయాన్ని అందించారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్ (31 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో స్టోయినిస్ (32), మిలింద్ కుమార్ (31), షుభమ్ రంజనే (26 నాటౌట్), స్మిత్ పటేల్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సాయితేజ ముక్కామల (6), డొనోవన్ ఫెరియెరా (9) విఫలమయ్యారు. వాషింగ్టన్ బౌలర్లలో మిచెల్ ఓవెన్ 3, మ్యాక్స్‌వెల్ 2, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓవెన్, గౌస్ చెలరేగిపోవడంతో 19.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 11, మ్యాక్స్‌వెల్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. గౌస్‌తో కలిసి గ్లెన్ ఫిలిప్స్ (4 బంతుల్లో 12 నాటౌట్) వాషింగ్టన్‌ను విజయతీరాలకు చేర్చాడు. వాషింగ్టన్ కోల్పోయిన మూడు వికెట్లు ఆడమ్ మిల్నే ఖాతాలో పడ్డాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఎంఎల్‌సీలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు నికోలస్ పూరన్ నేతృత్వంలోని ఎంఐ న్యూయార్క్ పేరిట ఉండింది. ఇదే సీజన్లో ఆ జట్టు సియాటిల్ ఓర్కాస్‌పై 201 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది (7 వికెట్లు కోల్పోయి). ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎంఎల్‌సీలో ఇదే భారీ లక్ష్య ఛేదనగా ఉండింది. -
ఆస్ట్రేలియా టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి పిలుపు
వచ్చే నెలలో వెస్టిండీస్‌లో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జూన్ 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నాడు. గత సీజన్ బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తొలిసారి జాతీయ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓవెన్‌తో పాటు బౌలర్ మ్యాట్ కుహ్నేమన్కు కూడా తొలిసారి ఆసీస్ టీ20 జట్టు నుంచి పిలుపు అందింది. ఈ జట్టులో మరో విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు చోటు దక్కలేదు. పేలవ ఫామ్ కారణంగా మెక్‌గుర్క్‌పై వేటు పడినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 ఫైనలిస్ట్ పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యులైన మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్స్‌వెల్‌కు ఈ జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ జట్టులో (ఆర్సీబీ) సభ్యుడైన టిమ్ డేవిడ్ కూడా ఈ జట్టులో చోటు సంపాదించాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కెమరూన్ గ్రీన్, కూపర్ కన్నోలీ టీ20 జట్టులోకి పునరాగమనం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకంగా వ్యవహరించిన జోష్ హాజిల్‌వుడ్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, ట్రవిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌కు విశ్రాంతినిచ్చారు.విండీస్‌తో టీ20 సిరీస్ జులై 19న మొదలు కానుంది. 19, 22, 24, 25, 27 తేదీల్లో ఐదు టీ20లు జరుగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు జమైకాలో జరుగనుండగా.. ఆఖరి మూడింటికి సెయింట్ కిట్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ విండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది. జూన్ 25, జులై 3, జులై 12 తేదీల్లో ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టెస్ట్, టీ20 సిరీస్‌ల కోసం ఆసీస్ వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఆసీస్ టెస్ట్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, కూపర్ కన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాట్ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపావిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, కెమరూన్ గ్రీన్, సామ్ కొన్‌స్టాస్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్, మ్యాట్ కుహ్నేమన్, మిచెల్ స్టార్క్ -
అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్
ఆస్ట్రేలియా యవ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశపరిచాడు.కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్ యువ పేసర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్‌కు చేరాడు. కాగా మరో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ స్ధానంలో పంజాబ్ జట్టులోకి ఓవెన్ వచ్చాడు.ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు మాక్సీ గాయం కారణంగా దూరం కావడంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం తన మొదటి మ్యాచ్‌లోనే తుస్సుమన్పించాడు.అంతకంటే ముందు మాక్స్వెల్ సైతం ఇదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వచ్చిన ఓవెన్ కూడా అదే తీరును కనబరిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌకటైన ఓవెన్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. మరో మాక్స్వెల్ జట్టులోకి వచ్చాడని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.ఈ టాస్మానియా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టులో చేరకముందు ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025 -
పంజాబ్ జట్టులోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే?
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ పంజాబ్ జట్టులో బుధవారం చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఆరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ మెనెజ్‌మెంట్ ఎంపిక చేసింది.కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో ఆగిపోవడంతో ఓవెన్.. పంజాబ్ జట్టుతో చేరడం కాస్త ఆలస్యమైంది. గురువారం(మే 15) నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఓవెన్‌ను సహచర ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది. కాగా ఈ ఆసీస్ క్రికెటర్ ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో పెషావల్ జల్మి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఈనెల 9న ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాక ఓవెన్ ఐపీఎల్లో భాగం కావాల్సి ఉండేది. కానీ పీఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా వాయిదా పడడంతో చివరి మ్యాచ్ ఆడకుండానే ఓవెన్ భారత్‌కు చేరుకున్నాడు.ఎవరీ మిచెల్ ఓవెన్..?23 ఏళ్ల మిచెల్ ఓవెన్ లిస్ట్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్‌తో లిస్ట్-ఎ క్రికెట్లో అడుగుపెట్టిన ఓవెన్.. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20ల్లో కూడా అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 35 టీ20లు ఆడిన ఓవెన్ 647 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్‌బాష్ సీజన్లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు.కేవలం 39 బంతుల్లోనే ఓవెన్ తన రెండో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను ఓవెన్ అందుకున్నాడు. ఓవెన్‌కు పేస్ బౌలింగ్ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్-2025 సీజన్ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.చదవండి: ICC: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే? -
మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.... పంజాబ్ ప్రకటన
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell) స్థానాన్ని మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ ఓవెన్ (Mitchell Owen)తో పంజాబ్ యాజమాన్యం భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.గాయం కారణంగా దూరంకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 4.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్పిన్నర్‌గా ఫర్వాలేదనిపించినా బ్యాటర్‌గా మాత్రం మాక్సీ తేలిపోయాడు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన అతను 48 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. అయితే, వేలికి గాయం కావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు మ్యాక్స్‌వెల్ అందుబాటులో ఉండడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బుధవారం (ఏప్రిల్ 30) స్పష్టం చేశాడు.రూ. 3 కోట్లకుచెన్నైతో మ్యాచ్‌కు ముందు పంజాబ్ సారథి శ్రేయస్ మాట్లాడుతూ... ‘అనుకోకుండా మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు. అతడి వేలు విరిగింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అన్నాడు. అయితే, తాజాగా మాక్సీ స్థానాన్ని మిచెల్ ఓవెన్‌తో భర్తీ చేశారు. రూ. 3 కోట్లకు పంజాబ్ అతడిని జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా టాస్మేనియాకు చెందిన మిచెల్ ఓవెన్ 34 ఇప్పటికి టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.బీబీఎల్ సంచలనంఇక ప్రస్తుతం ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, అతడు త్వరలోనే పంజాబ్ కింగ్స్‌తో చేరతాడు. 2024-25 బిగ్‌బాష్ లీగ్‌లో 452 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 200కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేసి హోబర్ట్ హ్యారికేన్స్ తొలిసారి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.కాగా సౌతాఫ్రికా స్టార్ కార్బిన్ బాష్ స్థానంలో మిచెల్ ఓవెన్ పెషావర్ జల్మీలో చేరాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడేందుకు బాష్ కాంట్రాక్టు రద్దు చేసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడిపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఓవెన్ మాత్రం ప్లే ఆఫ్స్ సమయానికి పంజాబ్ కింగ్స్‌తో చేరతాడని.. అంతవరకు పీఎస్ఎల్లో కొనసాగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా పీఎస్ఎల్ మే 18తో ముగుస్తుండగా.. మే 20 నుంచి ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.వారి పేర్లు వినిపించాయిఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆరు గెలిచి.. పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ విధ్వంసకరవీరుడికి యాజమాన్యం పిలుపునివ్వడం విశేషం.కాగా ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారయ్యే ముందు మ్యాక్స్‌వెల్ జట్టుకు దూరమవడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్, దక్షిణాఫ్రికా యువ ఆటగాడు లెస్ డు ప్లోయ్, అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ సలామ్ ఖైల్‌లో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చనే అంచనాలు నెలకొనగా.. అనూహ్యంగా మిచెల్ ఓవెన్ జట్టులోకి వచ్చాడు.చదవండి: RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని