
ఐపీఎల్-2025 పునఃప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ పంజాబ్ జట్టులో బుధవారం చేరాడు. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఆరో ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ మెనెజ్‌మెంట్ ఎంపిక చేసింది.
కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మధ్యలో ఆగిపోవడంతో ఓవెన్.. పంజాబ్ జట్టుతో చేరడం కాస్త ఆలస్యమైంది. గురువారం(మే 15) నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఓవెన్‌ను సహచర ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.
కాగా ఈ ఆసీస్ క్రికెటర్ ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2025లో పెషావల్ జల్మి జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అతడు ఈనెల 9న ఆ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాక ఓవెన్ ఐపీఎల్‌లో భాగం కావాల్సి ఉండేది. కానీ పీఎస్ఎల్ కూడా అర్ధాంతరంగా వాయిదా పడడంతో చివరి మ్యాచ్ ఆడకుండానే ఓవెన్ భారత్‌కు చేరుకున్నాడు.
ఎవరీ మిచెల్ ఓవెన్..?
23 ఏళ్ల మిచెల్ ఓవెన్ లిస్ట్-ఎ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రెండింటిలోనూ టాస్మానియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 22, 2021న మార్ష్ వన్-డే కప్‌తో లిస్ట్-ఎ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఓవెన్.. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అక్టోబర్ 3, 2023న ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. టీ20ల్లో కూడా అతడికి మంచి రికార్డు ఉంది.
ఇప్పటివరకు 35 టీ20లు ఆడిన ఓవెన్ 647 పరుగులు చేశాడు. అందులో 452 పరుగులు ఈ ఏడాది బిగ్‌బాష్ సీజన్‌లో చేసినవే కావడం గమనార్హం. బీబీఎల్ 2024-25 సీజన్‌లో ఓవెన్ 452 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌లో ఓవెన్ విధ్వసకర సెంచరీతో చెలరేగాడు.
కేవలం 39 బంతుల్లోనే ఓవెన్ తన రెండో బీబీఎల్ సెంచరీ మార్క్‌ను ఓవెన్ అందుకున్నాడు. ఓవెన్‌కు పేస్ బౌలింగ్ చేసే సత్తాకూడా ఉంది. అతడు త్వరలోనే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్-2025 సీజన్ మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
చదవండి: ICC: డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?