
PC: BCCI/IPL.com
ఆస్ట్రేలియా యవ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ఆరంభించాడు. ఐపీఎల్-2025లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశపరిచాడు.
కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండానే మిచెల్ పెవిలియన్‌కు చేరాడు. రాజస్తాన్ యువ పేసర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియన్‌కు చేరాడు. కాగా మరో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ స్ధానంలో పంజాబ్ జట్టులోకి ఓవెన్ వచ్చాడు.
ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు మాక్సీ గాయం కారణంగా దూరం కావడంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆటగాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం తన మొదటి మ్యాచ్‌లోనే తుస్సుమన్పించాడు.
అంతకంటే ముందు మాక్స్‌వెల్ సైతం ఇదే తరహా ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వచ్చిన ఓవెన్ కూడా అదే తీరును కనబరిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌకటైన ఓవెన్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. మరో మాక్స్‌వెల్ జట్టులోకి వచ్చాడని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.
ఈ టాస్మానియా ఆల్‌రౌండర్ ఇప్పటివరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జట్టులో చేరకముందు ఓవెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.
Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️
Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025