5 వికెట్ల‌తో చెల‌రేగిన ఆసీస్ యువ సంచ‌ల‌నం.. ప్లే ఆఫ్స్‌కు మాక్స్‌వెల్ టీమ్‌ | Mitchell Owen fifer powers Washington Freedom to playoffs | Sakshi
Sakshi News home page

MLC 2025: 5 వికెట్ల‌తో చెల‌రేగిన ఆసీస్ యువ సంచ‌ల‌నం.. ప్లే ఆఫ్స్‌కు మాక్స్‌వెల్ టీమ్‌

Jun 29 2025 12:19 PM | Updated on Jun 29 2025 1:02 PM

Mitchell Owen fifer powers Washington Freedom to playoffs

మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket) 2025 టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం డ‌ల్లాస్ వేదిక‌గా శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 12 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన వాషింగ్ట‌న్‌.. త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (58), జాక్ ఎడ్వార్డ్స్‌ (42), పియెనార్(30) రాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో బౌల‌ర్ల‌లో జేవియ‌ర్ బెర్ట్‌లెట్ నాలుగు వికెట్ల‌తో స‌త్తాచాట‌గా.. హారీస్ ర‌వూఫ్‌, షెఫ‌ర్డ్ త‌లా వికెట్ సాధించారు.

ఐదేసిన ఓవెన్‌..
ఇక బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన వాషింగ్టన్‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్, ఆసీస్ యువ సంచ‌ల‌నం మిచెల్ ఓవెన్ (Mitchell Owen) బౌలింగ్‌లో మాత్రం స‌త్తాచాటాడు. ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధి ఓట‌మిని శాసించాడు. ల‌క్ష్య చేధ‌న‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్  9 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగులకు ప‌రిమిత‌మైంది.

వాషింగ్టన్ బౌల‌ర్ల‌లో ఓవెన్‌తో పాటు ర‌చిన్ ర‌వీంద్ర‌, ఎడ్వ‌ర్డ్స్‌,హోలండ్ త‌లా వికెట్ సాధించారు. శాన్ ఫ్రాన్సిస్కో బ్యాట‌ర్ల‌లో కెప్టెన్‌  మాథ్యూ షార్ట్ (67; 40 బంతుల్లో) మాత్రమే రాణించాడు. కాగా శాన్ ఫ్రాన్సిస్కో జ‌ట్టు ఇప్ప‌టికే త‌మ ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మ‌రో రెండు స్ధానాల కోసం టెక్సాస్ సూప‌ర్ కింగ్స్‌, సియాటిల్ ఓర్కాస్, ఎంఐ న్యూయార్క్‌, లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ మ‌ధ్య పోటీనెల‌కొంది.
చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

Advertisement
 
Advertisement
Advertisement