చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు | Dewald Brevis Creates History, Breaks Massive World Record On Test Debut | Sakshi
Sakshi News home page

SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

Jun 29 2025 11:48 AM | Updated on Jun 29 2025 12:51 PM

Dewald Brevis Creates History, Breaks Massive World Record On Test Debut

తొలి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ (WTC) టైటిల్‌ను గెలుచుకున్న ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టు.. ప్ర‌స్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం జింబాబ్వేలో ప‌ర్య‌టిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు  బులవాయోలోని క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా శ‌నివారం(జూన్ 28) నుంచి ప్రారంభ‌మైంది.

తొలి రోజు ఆట‌లో స‌ఫారీ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. మొద‌టి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ద‌క్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల న‌ష్టానికి 418 ప‌రుగులు చేసింది. స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో అరంగేట్ర ఆటగాళ్లు లువాన్‌-డ్రి ప్రిటోరియస్‌(153), బాష్‌(100 బ్యాటింగ్‌) సెంచ‌రీలతో చెల‌రేగ‌గా.. డెవాల్డ్ బ్రెవిస్( 41 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 51) హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

అరంగేట్రంలోనే బ్రెవిస్ ఓ వ‌ర‌ల్డ్ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా బ్రెవిస్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బేబీ ఏబీడీ కేవలం 38 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు. 

బ్రెవిస్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ తన డెబ్యూ టెస్టులో 29 బంతులు, ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతల్ 37 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కానీ ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే కావడం గమనార్హం.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌! వీడియో వైరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement