ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌! వీడియో వైరల్‌ | Will Jasprit Bumrah Play Second Test vs England? | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్‌! వీడియో వైరల్‌

Jun 29 2025 8:52 AM | Updated on Jun 29 2025 12:13 PM

Will Jasprit Bumrah Play Second Test vs England?

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కాస్త ఊర‌ట ల‌భించింది. శ‌నివారం జ‌రిగిన నెట్ ప్రాక్టీస్ సెష‌న్‌లో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా పాల్గోన్నాడు.

శుక్ర‌వారం జ‌రిగిన‌ మొద‌టి ప్రాక్టీస్ సెష‌న్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. రెండో రోజు మాత్రం దాదాపు ఆరగంట పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో బుమ్రా తిరిగి మ‌ళ్లీ నెట్స్‌లో క‌న్పించ‌డం ఆసక్తిక‌రంగా మారింది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

అయితే రెండవ టెస్ట్‌లో బుమ్రా పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్‌ఫో త‌మ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా ఈ సిరీస్‌కు ముందే బుమ్రా కేవ‌లం మూడు మ్యాచ్‌ల‌లో మాత్ర‌మే ఆడ‌తాడ‌ని టీమిండియా మెనెజ్‌మెంట్ స్ప‌ష్టం చేసింది.

కానీ ఏ మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉంటాడ‌న్న విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఒక‌వేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల‌ని టీమ్ యాజ‌మాన్యం భావిస్తే.. వారి నిర్ణ‌యాన్ని మార్చుకునే అవ‌కాశ‌ముంది. ఎందుకంటే తొలి టెస్టులో ఓట‌మి పాలైన భార‌త్‌కు.. బ‌ర్మింగ్‌హామ్ టెస్టు చాలా కీల‌కం. 

ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ 1-1 స‌మమ‌వుతోంది. అదే ఓడిపోతే 0-2తో టీమిండియా వెన‌క‌బ‌డుతోంది. కాబ‌ట్టి రెండో టెస్టులో ఆడించి బుమ్రాకు మూడో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు గంభీర్ అండ్ కో ఉన్న‌ట్లు స‌మాచారం. బుమ్రా విష‌యంలో మ‌రి ఏ నిర్ణ‌యం తీసుకుంటారో మ‌రో మూడు రోజులు వేచి చూడాలి.

కాగా రెండో రోజు ప్రాక్టీస్‌కు టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌, రిష‌బ్ పంత్ దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాక్టీస్‌లో మాత్రం భార‌త జ‌ట్టు ఫీల్డింగ్, ఫిట్‌నెస్ డ్రిల్స్‌పై ఎక్కువ‌గా దృష్టిసారించింది.


చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్‌గా

 

 

Advertisement
 
Advertisement
Advertisement