అమెరికాలో కశ్మీరీ దర్శకుడి అరెస్ట్‌ | Kashmiri filmmaker Arafat Sheikh detained by ICE at US airport | Sakshi
Sakshi News home page

అమెరికాలో కశ్మీరీ దర్శకుడి అరెస్ట్‌

Oct 8 2026 5:14 AM | Updated on Oct 8 2026 5:14 AM

Kashmiri filmmaker Arafat Sheikh detained by ICE at US airport

వాషింగ్టన్‌: కశ్మీరీ సినిమా దర్శకుడు అరాఫత్‌ షేక్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వాషింగ్టన్‌లో సెపె్టంబరు 24న అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 2019 నుంచి విద్యార్థి వీసాతో అమెరికాలోనే ఉంటున్న ఈయనను వాషింగ్టన్‌లోని డుల్లెస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగీ దిగగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారని మద్దతుదారులు తెలిపారు. ప్రఖ్యాత దర్శకురాలు తారా దొరబ్జీతో కలిసి వాషింగ్టన్‌లోని బస్‌బాయ్స్‌ అండ్‌ పోయెట్స్‌లో ‘ఆర్ట్స్‌ యాస్‌ రెసిస్టెన్స్‌’’ అన్న కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూండగా ఈ ఘటన జరిగింది. 

అరాఫత్‌ జార్జియా స్టేట్‌ యూనివర్శిటీలో సినిమాలపై విద్యనభ్యసిస్తున్నారు. 2020లో శరణార్థి హోదా కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇమ్మిగ్రేషన్‌ కోసం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. అరాఫత్‌ అమెరికాలో నివసించేందుకు అనుమతులు ఉన్నాయని, ఇందుకు తగ్గట్టుగా వర్జీనియాలోని అలెగ్జాండియాలో నివసిస్తున్నారని ఆయన విడుదల కోరుతూ మొదలైన ఆన్‌లైన్‌ కార్యక్రమం ‘ఫ్రీ అరాఫత్‌ షేక్‌’ తెలిపింది. 

అరెస్టు సమయంలో పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్‌ పత్రాలు సమర్పించినా అధికారులు పట్టించుకోలేదని, తెలుస్తోంది. ‘కాషాయ సామ్రాజ్యం’ పేరుతో అరాఫత్‌ తీసిన మొదటి సినిమా కశ్మీర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో కుటుంబాల అనుభవాలను తెరకెక్కించింది. ఈ సినిమా షికాగో ఫిల్మ్‌మేకర్స్‌ అవార్డుతోపాటు ఎల్‌ఏ ఫిల్మ్‌ అండ్‌ డాక్యుమెంటరీ అవార్డు పొందింది. అలాగే మెల్బోర్న్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, వేక్‌ ఫారెస్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, అనటోలియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు అందుకుంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement