breaking news
Arafat
-
ఆసీస్ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు
పాకిస్తాన్ క్రికెట్‌కు మరో అద్భుతమైన ఆల్‌రౌండర్ దొరికాడు. అరంగేట్రంలో తన స్పిన్ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుకే చుక్కలు చూపించాడు. ఆ యువ స్పిన్నర్‌ను జోష్ ఇంగ్లిష్, మార్నస్ లబుషేన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఎదుర్కోలేకపోయారు. అతడే 21 ఏళ్ల అరాఫత్ మిన్హాస్. శనివారం రావల్పిండి వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేతో మిన్హాస్ అరంగేట్రం చేశాడు.మిన్హాస్ మూడేళ్ల కిందటే టీ20ల్లో డెబ్యూ చేసినప్పటికి పేలవ ప్రదర్శనల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవల డొమాస్టిక్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాక్ సెలెక్టర్ల నుంచి మళ్లీ అతడికి పిలుపు వచ్చింది. ఈసారి మాత్రం సెలెక్టర్ల నమ్మకాన్ని అరాఫత్ నిలబెట్టుకున్నాడు.తన మొదటి వన్డేలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన పాకిస్తాన్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1984లో జకీర్ ఖాన్ తన వన్డే డెబ్యూలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో 42 ఏళ్ల రికార్డును అరాఫత్ బ్రేక్ చేశాడు.అతడి బౌలింగ్ ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్(55), మాట్ రెన్షా(61) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అరాఫత్‌తో పాటు షాహీన్ షా అఫ్రిది, రౌఫ్, అఘా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
హజ్ యాత్రలో 20 లక్షలు
మౌంట్ అరాఫత్: హజ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని ‘అరాఫత్’ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు. -
అరాఫత్‌లో హజ్ యాత్రికుడి మృతి
సాక్షి, హైదరాబాద్: మక్కా సమీపంలోని అరాఫత్‌లో ఆదివారం హజ్ యాత్రికుడు ముజీబ్-ఉర్-రహ్మన్(70) మృతి చెందారు. హైదరాబాద్‌లోని నవాబ్ సాబ్ కుంటకు చెందిన రహ్మన్ తన కూతురు, అల్లుడితో కలసి రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రకు వెళ్లారు. కాగా, అక్కడ ఒక్కసారిగా అనారోగ్యానికి గురై సహజ మరణం పొందారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని ఖాదీమ్-ఉల్ హుజ్జాజ్కు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ ఆదేశించారు. -
త్వరలో ఎన్ఐఏకు నిందితుల అప్పగింత
నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఉగ్రవాద ఆఫర్ ఇచ్చిన అరాఫత్! బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణల పై అరెస్ట్ అయిన సయ్యద్ ఇస్మయిల్ అ ఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లు పోలీ సుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 2013 ఫిబ్రవరిలో జరిగిన బాంబుపేలుళ్లు, పూనెలోని జర్మన్బేకరి పేలుళ్ల వెనుక వీరి ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సోదాల్లో వీరి వద్ద దొరికిన వస్తువులు, పేలుళ్ల సమయంలో అక్కడ దొరికొని వస్తులవులతో పోల్చి చూసిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బాంబుల తయారీ, రవాణా లో అఫక్ ఆదేశాలను అనుసరించి మిగి లిన ఇద్దరూ పనిచేసేవారని తెలుస్తోంది. అఫక్ బాంబుల తయారీకి సంబంధించి పాకిస్తాన్లో శిక్షణ పొందాడని పోలీసులు భావిస్తున్నారు. హోమియోపతిపై పరి జ్ఞానం ఉన్న అఫక్ యువకులను అందులోనూ ఇంగ్లిషు, ఐటీతోపాటు వైద్య విధానాలపై పరిజ్ఞానం ఉన్న వారిని ఉగ్రవాదం పై ఆకర్షితులను చేసేందుకు య త్నించేవాడని సమాచారం. ఇందుకోసం ఫేస్బుక్, ట్విట్టర్ తదితర నెట్వర్కింగ్ సైట్ల ద్వారా విద్యార్థులతో సంభాషించేవాడు. ఇతని వలలో పడిన విద్యార్థులను కలుసుకోవడానికి నేరుగా వారు చదువుతున్న విద్యాసంస్థల వద్దేకే వెళ్లేవాడు. తద్వారా మరికొంత మందిని కలుసుకోవడానికి వీలవుతుందని అఫక్ భావించేవాడు. ఇతని నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్, సెల్ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించి పోలీసులు ఈ విషయా లు తెలుసుకున్నారు. ఇదిలా ఉం డగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాల్లో జరిగిన బాంబు పేలుళ్ల వెనుక వీరి హస్తం ఉన్న ట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో వీరి ముగ్గురిని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కు అప్పగించాలని పోలీసులు నిర్ణయిం చారు. ఎన్ఐఏ అధికారులు త్వరలో బెం గళూరుకు వచ్చి వీరి ముగ్గురుని అదుపులోకి తీసుకోనున్నారని పో లీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా తమ కుమారులు అమాయకులని, అనవసరంగా కేసులో ఇరికిం చారని వారి తల్లిదండ్రులు బెంగళూరులో శనివారం మీడియా సమావేశంలో కన్నీరుమున్నీరుగా విలపించారు.


