హజ్‌ యాత్రలో 20 లక్షలు

Muslim hajj pilgrims ascend Mount Arafat for day of worship - Sakshi

మౌంట్‌ అరాఫత్‌: హజ్‌ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని ‘అరాఫత్‌’ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్‌ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్‌ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్‌ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top