ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే | Mitch Owen didnt get a game in IPL 2026 for PBKS, but he has started MLC 2026 with a bang | Sakshi
Sakshi News home page

MLC 2026: ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

Jun 20 2026 3:31 PM | Updated on Jun 20 2026 4:44 PM

Mitch Owen didnt get a game in IPL 2026 for PBKS, but he has started MLC 2026 with a bang

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్‌ను వాషింగ్టన్ ప్రీడమ్ ఓటమితో ప్రారంభించింది. శనివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో వాషింగ్టన్ ఓటమి పాలైంది. వాషింగ్టన్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని సీటెల్ ఓర్కాస్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఊదిపడేసింది. 

ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో 78), ఫస్ట్ డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే (36 బంతుల్లో 66), దసున్ శనక(12 బంతుల్లో 36) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌరభ్ నేత్రవల్కర్, ఇయాన్ హాలండ్ తలా రెండు వికెట్లు సాధించారు.

మిచెల్ మెరుపులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ప్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ మిచెల్ ఓవెన్ విధ్వంసం సృష్టించాడు.

కేవలం 25 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. కాగా 24 ఏళ్ల ఓవెన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ అతడికి ఐపీఎల్‌-2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. రూ. 3 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుని మరి అతడిని పంజాబ్ బెంచ్‌కే పరిమితం చేసింది.

ఆ కసిని అతడు ఈ అమెరికా టీ20 లీగ్‌లో చూపించాడు. అతడితో పాటు కివీస్ ప్లేయర్ మార్క్ చాప్‌మన్‌(57) రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో బార్ట్‌మన్ నాలుగు, శనక మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: IND vs SL: వైభవ్‌ను టార్గెట్‌ చేస్తారా?.. లంక కెప్టెన్‌ ఏమన్నాడంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement