
న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్ (NZ vs ENG 1st T20)కి ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏకంగా నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లకు చోటిచ్చింది. కాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చివరగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే.
డబ్లిన్ వేదికగా ఆతిథ్య ఐరిష్ జట్టుపై ఇంగ్లండ్ 2-0తో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇక ఈ సిరీస్‌లో హ్యారీ బ్రూక్ (Harry Brook) గైర్హాజరీలో యువ ఆటగాడు జేకబ్ బెతెల్ ఇంగ్లండ్ సారథిగా వ్యవహరించాడు.
బ్రూక్ రీఎంట్రీ
ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు బ్రూక్ తిరిగి వచ్చి పగ్గాలు మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా శనివారం (అక్టోబరు 18) ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.
జోస్ బట్లర్‌తో పాటు..
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో జరిగే తొలి టీ20కి ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును ప్రకటించింది. బ్రూక్ సారథ్యంలోని ఈ జట్టులో జోస్ బట్లర్‌తో పాటు.. ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, జోర్డాన్ కాక్స్ (Jordan Cox) రూపంలో నలుగురు వికెట్ కీపర్ బ్యాటర్లు ఉండటం విశేషం. బట్లర్ ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా వ్యవహరించనుండగా.. ఈ ముగ్గురికీ చోటు దక్కడం గమనార్హం.
ఇక ఆల్‌రౌండర్ల కోటాలో జేమీ ఓవర్టన్‌ను బెంచ్‌కే పరిమితం చేసిన ఇంగ్లండ్.. బ్రైడన్ కార్స్, సామ్ కర్రాన్‌లను జట్టులో చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగనుంది. ఆదిల్ రషీద్‌తో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేకబ్ బెతెల్ కూడా ఇందులో భాగం కానున్నాడు. అయితే, టీ20 స్పెషలిస్టు ల్యూక్ వుడ్ కారణంగా సోనీ బేకర్ ఈసారికి బెంచ్‌కే పరిమితమయ్యాడు.
న్యూజిలాండ్‌తో తొలి టీ20కి ఇంగ్లండ్ తుదిజట్టు ఇదే
ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), టామ్ బాంటన్, సామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బెతెల్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, బెన్ డకెట్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్, ల్యూక్ వుడ్.
న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: అక్టోబరు 18- క్రైస్ట్‌చర్చ్
రెండో టీ20: అక్టోబరు 20- క్రైస్ట్‌చర్చ్
మూడో టీ20: అక్టోబరు 23- ఆక్లాండ్.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లన్నీ ఉదయం 11.45 నిమిషాలకు ఆరంభం.
చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ