
ఫ్లోరిడా వేదికగా పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది.
పాక్ బ్యాటర్లలో హసన్ నవాజ్(40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ అఘా(38) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జాసెన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు, అకిల్ హోస్సేన్, చేజ్, జోషఫ్ తలా వికెట్ సాధించారు.
అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో వెస్టిండీస్ తడబడింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. అయితే జాసన్ హోల్డర్(16),షెఫర్డ్(15) కాస్త దూకుడుగా ఆడడడంతో విండీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.
ఈ క్రమంలో ఆఖరి ఓవర్‌లో కరేబియన్ జట్టు విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. షాహీన్ అఫ్రిది వేసిన తొలి బంతికి హోల్డర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి షెఫర్డ్ ఔటయ్యాడు. తర్వాతి మూడు బంతుల్లో మూడు పరుగులు వచ్చాయి.
దీంతో ఆఖరి బంతికి విండీస్ గెలుపునకు 4 పరుగులు అవసరమయ్యాయి. ఆ బంతిని అఫ్రిది వైడ్‌గా సంధించడంతో విండీస్ విజయసమీకరణంగా మూడు పరుగులగా మారింది. ఈ క్రమంలో హోల్డర్ ఆఖరి బంతిని బౌండరీకి తరలించాడు.
దీంతో సంచలన విజయాన్ని హోప్ సేన తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో ఆతిథ్య విండీస్ సమం చేసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సైమ్ అయూబ్ రెండు వికెట్లు సాధించాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆగస్టు 4న జరగనుంది.
చదవండి: WCL: డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ.. ఫైనల్లో పాక్ చిత్తు! టైటిల్ సౌతాఫ్రికాదే