భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 కాన్‌బెర్రా బుధవారం(అక్టోబర్ 29) జరగనుంది. టీమిండియాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసకున్న ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
తొలి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని కంగారులు వ్యూహాలు రచిస్తున్నారు. భారత్ తమ తుది జట్టును ఖరారు చేయడానికి తర్జన భర్జన పడుతుంటే, ఆస్ట్రేలియా మాత్రం ఇప్పటికే తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఆసీస్ సెలక్టర్లు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు టీ20లకు దూరంగా ఉండనున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్.. ఆఖరి మూడు టీ20లకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా యాషెస్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ఆఖరి మూడు టీ20లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
టీమిండియా కంటే బెటర్‌గా..
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత.. ఆస్ట్రేలియా పొట్టి క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరుస సిరీస్‌ల విజయాలతో ఆసీస్ రెండో స్ధానంలో కొనసాగుతోంది. ర్యాంకింగ్స్‌లో కంగారుల కంటే భారత్ ముందుంజలో ఉన్నప్పటికి.. ఇటీవల కాలంలో ఆటగాళ్ల ప్రదర్శన పరంగా కంగారులే మెరుగ్గా కన్పిస్తున్నారు.
టీ20 వరల్డ్‌కప్-2024 తర్వాత ఆస్ట్రేలియా ఇప్పటివరకు 19 టీ20లు ఆడి కేవలం కేవలం రెండు మాత్రమే ఓడిపోయింది. ఆసీస్ బ్యాటింగ్ రన్‌రేట్ 10.07గా ఉండగా, భారత్ 9.69తో రెండో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆప్రోచ్ పూర్తిగా మారిపోయింది. మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆసీస్ జట్టు ఫియర్ లెస్ బ్యాటింగ్ విధానాన్ని ఎంచుకుంది.
ఓపెనర్ల నుంచి ఎనిమిదో స్ధానం బ్యాటర్ వరకు హిట్టింగ్ చేసే సత్తా ఉంది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఆరంభాలను ఇస్తుండగా.. మిడిలార్డర్‌లో జోష్ ఇంగ్లిష్, టిమి డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఆఖరిలో స్టోయినిష్, ఓవెన్ వంటి ఆల్‌రౌండర్లు తమ పని తాము చేసుకుపోతున్నారు.
ఇటీవల కాలంలో పేసర్ దుర్హనియస్ కూడా బ్యాట్‌తో సత్తాచాటుతున్నాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ ఛాన్నాళ్ల తర్వాత ఆసీస్ టీ20 జట్టులోకి వచ్చాడు. అతడు కూడా తన బ్యాట్‌కు పనిచెబితే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇక తొలి తొలి టీ20కు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా దూరమైనప్పటికి.. జోష్ హాజిల్‌వుడ్, ఈల్లీస్, బార్ట్‌లెట్ వంటి పేస్ పవర్ హౌస్ ఆసీస్ వద్ద ఉంది.
భారత్‌తో తొలి టీ20కు ఆసీస్ తుది జట్టు(అంచనా)
మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), జోష్ ఫిలిప్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, తన్వీర్ సంఘా
చదవండి: Shreyas Iyer injury update: శ్రేయస్ అయ్యర్ తల్లిదండ్రుల కీలక నిర్ణయం..


