
దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్ట్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైఖల్ బ్రెస్‌వెల్(26), నీషమ్(25) రాణించారు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్, బార్ట్‌లెట్ తలా రెండు వికెట్లు సాధించారు.
మార్ష్ విధ్వంసకర సెంచరీ..
అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిగితా బ్యాటర్లు తేలిపోయినప్పటికి మార్ష్ మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
కేవలం 52 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్ష్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అతడి విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ నాలుగు వికెట్లు సాధించాడు. అతడితో పాటు ఢపీ రెండు, సీర్స్ ఓ వికెట్ పడగొట్టాడు.