
సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో విండీస్‌పై 3 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
విండీస్ బ్యాటర్లలో షెర్ఫెన్ రూథర్ ఫర్డ్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిమోరియా షెఫర్డ్(28), హోల్డర్(26),రావ్‌మన్ పావెల్(28) రాణించారు. మూడో టీ20 సెంచరీతో మెరిసిన కెప్టెన్ షాయ్ హోప్(10) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్దే, బెర్ట్‌లెట్, అబాట్ తలా వికెట్ సాధించారు.
మాక్స్‌వెల్ విధ్వంసం..
అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), జోష్ ఇంగ్లిష్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. గ్లెన్ మాక్స్‌వెల్(18 బంతుల్లో 6 సిక్సర్లతో, ఒక ఫోరుతో 47) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, హోస్సేన్ తలా వికెట్ సాధించారు. కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్తోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని కంగారూ జట్టు భావిస్తోంది. ఇరు జట్లు మధ్య ఐదో టీ20 ఇదే వేదికలో జూలై 29న జరగనుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రాహుల్-గిల్ జోడీ.. ప్రపంచంలోనే