టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26కు కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా కిషన్ ఎంపికయ్యాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.
ఇప్పుడు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో తన జట్టును విజయ పథంలో నడిపించేందుకు కిషన్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ టోర్నీలో కిషన్‌కు డిప్యూటీగా వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో విరాట్ సింగ్, అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ వంటి టాలెంటెడ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. జార్ఖండ్ తమ తొలి మ్యాచ్‌లో డిసెంబర్ 24న కర్ణాటకతో తలపడనుంది.
ఇక టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కారణంగా అతడిని సెకెండ్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన ఈ పాకెట్ డైన్‌మైట్ 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో కూడా సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు అతడు ఎంపికయ్యాడు.
విజయ్ హాజారే ట్రోఫీకి జార్ఖండ్ జట్టు
ఇషాన్ కిషన్ (కెప్టెన్), విరాట్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, కుమార్ కుషాగ్రా (వైస్ కెప్టెన్), రాబిన్ మింజ్, అనుకుల్ రాయ్, శరణదీప్ సింగ్, శిఖర్ మోహన్, పంకజ్ కుమార్, బాల కృష్ణ, మహ్మద్ కౌనైన్ ఖురైషీ, శుభ్ శర్మ, అమిత్ కుమార్, మనీషి, అభినవ్ శరణ్, సుశాంత్ మిశ్రా, వికాస్ సింగ్, సౌరభ్ శేఖర్, రాజందీప్ సింగ్, శుభమ్ సింగ్.
చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!


