ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోరు | T20 WC Warm Up Match: Ishan Tilak Shines IND Score 240 Vs SA | Sakshi
Sakshi News home page

ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోరు

Feb 4 2026 9:04 PM | Updated on Feb 4 2026 10:14 PM

T20 WC Warm Up Match: Ishan Tilak Shines IND Score 240 Vs SA

తిలక్‌ వర్మ (PC: BCCI)

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా  సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన ఇషాన్‌ కిషన్‌తో పాటు.. రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో దుమ్ములేపారు.

ఇషాన్‌, తిలక్‌ వర్మ విధ్వంసం
నవీ ముంబై వేదికగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఇషాన్‌ కిషన్‌ 20 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 53 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (18 బంతుల్లో 24) స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. వీరిద్దరు ధనాధన్‌ దంచికొట్టి రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగారు.

ఇక మూడో స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 45 పరుగులు సాధించాడు. అయితే, ప్రొటిస్‌ పేసర్‌ మార్కో యాన్సెన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయిన తిలక్‌ హాఫ్‌ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు.

రాణించిన సూర్య, అక్షర్‌, హార్దిక్‌
మరోవైపు.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30) వేగంగా ఆడే ప్రయత్నంలో.. క్వెనా మఫాకా బౌలింగ్‌లో జార్జ్‌ లిండేకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. మిగిలిన వారిలో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (10 బంతుల్లో 30) రాణించారు. రింకూ సింగ్‌ 13 బంతుల్లో 16 పరుగులు చేశాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 240 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్, అన్రిచ్‌ నోర్జే, క్వెనా మఫాకా తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 

కాగా భారత్‌- శ్రీలంక వేదికలుగా ఫిబ్రరి 7 నుంచి టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇందులో భాగంగా టీమిండియా తొలి రోజు పసికూన అమెరికాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టీమిండియా జగజ్జేతగా అవతరించిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 WC 2026: ‘భారత్‌- పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement