విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్ధి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీల(147, 124)తో సత్తాచాటిన పడిక్కల్.. తర్వాత తమిళనాడు మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు.
మళ్లీ ఇప్పుడు త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకు త్రిపుర బౌలర్లు గట్టి షాకిచ్చారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్(5), కరుణ్ నాయర్(0) ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో పడిక్కల్ నిలకడగా ఆడి తన 13వ లిస్ట్-ఎ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
సెలక్టర్లకు హెడ్ ఎక్..
అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పడిక్కల్‌ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో పడిక్కల్‌కు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. అయితే భారత జట్టులో ప్రస్తుతం ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవు.
రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్ భారత జట్టు ఓపెనర్లగా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో గిల్ స్ధానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికి గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
అలా అని మిడిలార్డర్‌లో చూసుకున్నా ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఒకవేళ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తే రుతురాజ్, తిలక్ వర్మలపై కూడా వేటు పడే అవకాశముంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అదుర్స్..
లిస్ట్-ఏ క్రికెట్‌లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే. కేవలం 38 మ్యాచ్‌ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు ఉండటం విశేషం. పడిల్క్ భారత తరపున ఇప్పటివరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికి.. వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక
ఇక కివీస్‌తో వన్డేలకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించనుంది. అయితే భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వేటు వేయాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చదవండి: IND vs SA: కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్


