విజయ్‌హజారే వన్డే ట్రోఫీ 2025-26లో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం రాజ్‌కోట్ వేదికగా చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల తేడాతో భారీ విజయాన్ని హైదరాబాద్ అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.
ఓపెనర్లు అమన్ రావు (13), తన్మయ్ అగర్వాల్ (16) విఫలం కాగా, అరంభంలోనే నిష్క్రమించగా.. అభిరత్ రెడ్డి (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తిలక్ వర్మ ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. మరో ఎండ్‌లో ఇతర బ్యాటర్లు విఫలమైనా...పట్టుదలగా ఆడిన తిలక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఓవరాల్‌గా తిలక్ 118 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన చండీగఢ్ 37.4 ఓవర్లలో 150 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ సంయమ్ సైనీ (32 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా...సీవీ మిలింద్, నితీశ్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.
తిలక్‌కు నో ఛాన్స్..
తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భార జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో తిలక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌పై సెలెక్టర్లు వేటు వేశారు.
వీరిద్దరూ సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత తరపున ఆడారు. వైజాగ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో తిలక్ ఆడినప్పటికి.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తిలక్ టీ20లతో పాటు లిస్ట్-ఎ క్రికెట్‌లో కూడా దుమ్ములేపుతున్నాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా అతడికి వన్డే జట్టులో చోటు దక్కలేదు.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (ఫిట్‌నెస్‌కు లోబడి)*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, జైశ్వాల్, అర్ష్‌దీప్


