
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టీస్ సుదర్శన్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ఇండియా కూటమి అభ్యర్థి ప్రకటనకు ముందే ఎన్డీఏ నేతలు తమతో మాట్లాడారని బదులిచ్చారు. ఎన్డీఏ అభ్యర్థన మేరకు ముందుగానే వారికి మాట ఇచ్చినట్లు చెప్పారు. వ్యక్తిగతంగా సుదర్శన్‌రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్న జగన్..న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అపారమైన సేవలు అందించారని కితాబు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించ వద్దని విజ్ఞప్తి చేశారు.