విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం | INDIA Bloc Demands Education Minister’s Resignation Over NEET Paper Leak Allegations | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ మంత్రి రాజీనామా?.. ఇండి కూటమి కీలక నిర్ణయం

Jun 8 2026 3:32 PM | Updated on Jun 8 2026 3:53 PM

Key decision at India Alliance meeting

సాక్షి, ఢిల్లీ: నీట్‌ పరీక్షపత్రాల లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే Sirపై త్వరలోనే భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం కోసం విపక్ష ఇండియా కూటమి ఈ రోజు ఢిల్లీలో సమావేశమైంది. ఈ మీటింగ్‌లో ఎన్డీఏపై పోరాటానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 
     1 ఎన్నికల్లో ఓటు చోరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం.
     2 విద్యామంత్రి వెంటనే రాజీనామా చేయాలి . NEET, CBSE పరీక్షలు రాసిన లక్షలాది యువకులను మోసం చేశారు. 
     3 దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఇతర సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని పార్టీల సమావేశం పిలవాలి.
    4 అన్ని పార్టీలు ప్రతి రెండు నెలలకొకసారి సమావేశం.

తదుపరి సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిపారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో ఇండియా కూటమి ఐక్యత కొనసాగించాలని కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement