మాకు పెళ్లి అవుతోంది.. రంజనితో మాట్లాడడం మానేయ్! | Tamil Nadu Woman Police Officer Ranjani Ends Her Life, Police Probe Relationship Dispute Angle | Sakshi
Sakshi News home page

మాకు పెళ్లి అవుతోంది.. రంజనితో మాట్లాడడం మానేయ్!

Jul 25 2026 9:46 AM | Updated on Jul 25 2026 10:18 AM

Female Constable Ends Life In Tamil Nadu

తమిళనాడు: తిరువణ్ణామలై జిల్లాకు చెందిన పోలీసు అధికారిణి రంజని (24) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె 2022లో పోలీసు శాఖలో చేరారు. ప్రస్తుతం తిరుప్పూర్‌ జిల్లా సాయుధ దళాలలో పనిచేస్తూ కాంగేయం రోడ్డులోని నల్లూరు పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం ఆమె గది తాళం వేసి ఉండడంతో తోటి పోలీసు అధికారులు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ గదిలో రంజని ఉరి వేసుకుని చనిపోయి ఉండడాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న నల్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని రంజని మృతదేహాన్ని తిరుప్పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. 

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజని మెట్రోపాలిటన్‌ సాయుధ దళాలలో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారితో ప్రేమలో ఉందని, ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆమె సెల్‌ పరిశీలించారు. మరణానికి ముందు ఏ నంబర్ల నుంచి కాల్‌ వచ్చిందో,  ఎంతసేపు మాట్లాడిందో వంటి వివరాలను సేకరించారు. రంజనితో చివరిసారిగా మాట్లాడిన ముగ్గురు పోలీసు అధికారులను గుర్తించి స్టేషన్‌కు పిలిపించి విచారించారు. రంజని, తిరువణ్ణామలైకి చెందిన ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, ఈ వ్యవహారం బయటపడిన తర్వాత, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లికి అంగీకరించినట్టు తేలింది. పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

ఈ పరిస్థితిలో రంజని తిరుప్పూర్‌లో పనిచేస్తున్న ఒక వివాహితుడైన పోలీసుతో తన సెల్‌ ఫోన్‌లో తరచుగా మాట్లాడేదని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు పోలీసును బెదిరించాడు. ‘మాకు పెళ్లి అవుతోంది, నువ్వు రంజనితో మాట్లాడడం మానేయాలి అని అతను చెప్పాడు. దీంతో ఆమె ఫోన్‌ మాట్లాడుతునే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement