బిహార్‌లో మహాగఠ్‌బంధన్ నుంచి ఆర్జేడీ యువనేత పేరు ఖరారు
ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సహానీ
ఏకగ్రీవంగా ఎంపిక చేసిన కూటమి నేతలు
పనికిమాలిన ఎన్డీఏను ఓడిస్తాం: తేజస్వీ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో విపక్ష మహాగఠ్‌బంధన్ (మ హాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఊహాగానాలకు తెరది ంచుతూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పారీ్ట(వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ పేరును ప్రకటించాయి. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజుపాటు జరిగిన చర్చోపచర్చలు ఎట్టకేలకు ముగిశాయి. కూటమి నేతలు గురువారం పటా్నలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిహార్‌లో మార్పు కోసం ఏడు పారీ్టల మహాగఠ్‌బంధన్ ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
తేజస్వీనే మా సీఎం: అశోక్ గహ్లోత్
కూటమి ముఖ్యమంత్రి అభ్యరి్థగా యువనేత తేజస్వీ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన నవ యువకుడు అని, ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హా మీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టకొని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో సామాజిక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం, డీప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు కూటమి నేతలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని స్పష్టంచేశారు.
కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాం: తేజస్వీ
ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ నిప్పు లు చెరిగారు. బిహార్‌లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు. పనికిమాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామని ఉద్ఘాటించారు ‘‘ఎన్డీఏ నేత లు నకలీ్చ(కాపీక్యాట్లు). మేం ఏ హామీ ఇ స్తే, వాళ్లు దాన్నే కాపీ కొడుతున్నారు. వాళ్ల కు సొంత ఏజెండా లేదు. బిహార్‌లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ చెప్పలేదు. ఎన్డీఏ నేతలంతా అలసిపోయిన నేత లు. బిహార్‌ను మోసం చేయడంలో వారంతా నిమ గ్నమయ్యారు.
సీఎం నితీశ్ కుమా ర్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది నితీశ్ కుమార్‌కు జరుగుతున్న అన్యాయం’’ అని తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో రా ష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరి గిపోయాయని ఆరోపించారు. ‘‘రూ.70 వే ల కోట్ల కాగ్ స్కామ్, సృజన్ కుంభకోణం, బాలికా గృహ్ ఘటనలపై చర్యల్లేవు. వంతెనలు కూలుతున్నాయి, ఎలుకలు మద్యం తాగుతున్నాయి, రోజూ కాల్పులు జరుగుతున్నాయి. అవినీతి, ఆఫీసర్ల దౌర్జన్యంతో ప్రజలు విసిగారు’’ అని పేర్కొన్నారు.
హామీల వర్షం
మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యో గం, మాయీ–బహిన్ మాన్ యోజన (మహిళలకు ఆర్థిక సాయం), గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని తేజస్వీ యా దవ్ హామీ ఇచ్చారు. జీవికా దీదీలకు(స్వ యం సహాయక బృందాల మహిళలు) నె లకు రూ.30 వేల జీతంతో శాశ్వత ఉద్యో గం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబదీ్ధకరిస్తామని వాగ్దానం చేశారు.
బీజేపీని వదలం: ముఖేష్ సహానీ
ఈ రోజు కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ వ్యాఖ్యానించారు. బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశామని, ఆ సమయం ఇప్పుడు వచి్చందని స్పష్టంచేశారు.


