సాక్షి,చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, డీఎంకే ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.
డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసి, డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లేఖతో డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి.
కాంగ్రెస్ ఇటీవల టీవీకేకు మద్దతు ప్రకటించడం డీఎంకేకు పెద్ద షాక్‌గా మారింది. డీఎంకే నేతృత్వం దీనిని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌కు ద్రోహంగా అభివర్ణించింది. దీంతో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఒక్కసారిగా ముగిసింది.
డీఎంకే ఈ నిర్ణయం వల్ల ఇండియా కూటమి బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, టీవీకే-కాంగ్రెస్ కూటమి బలపడుతుందని అంచనా. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు,కొత్త వ్యూహాలు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.


