చరణ్ సినిమా.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి | New gossip surrounding Ram Charan movie lineup with Bhansali, Aditya Dhar | Sakshi
Sakshi News home page

సుకుమార్ మౌనం.. ఆదిత్య ధర్–భన్సాలీ పేర్ల హడావిడి

Apr 11 2026 11:26 PM | Updated on Apr 12 2026 5:59 AM

New gossip surrounding Ram Charan movie lineup with Bhansali, Aditya Dhar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లైనప్‌పై బాలీవుడ్ నుంచి వరుసగా లీకులు వస్తున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉందనే క్లారిటీ ఉండగా, తాజాగా ఆదిత్య ధర్ – సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపించడం ఆసక్తికరంగా మారింది. ధురంధర్‌-2 వంటి సూపర్ హిట్ తర్వాత ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ కథను సిద్ధం చేస్తున్నాడని, అందులో రామ్‌ చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కథ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు చరణ్ పేరు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.  

మరోవైపు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ – చరణ్ కాంబోపై కూడా వార్తలు వస్తున్నాయి. అటవీ నేపథ్యంలో హిస్టారికల్ అడ్వెంచర్ కథను భన్సాలీ తెరకెక్కించే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. గతంలో ‘మహారాజా సుహేల్ దేవ్’ అనే ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. అయితే అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోపై చర్చ మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దర్శకుడు సుకుమార్, చరణ్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం వల్లే ఈ గాసిప్పులు ఎక్కువయ్యాయి. చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా ప్రకటన వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దాంతో బాలీవుడ్ వైపు నుంచి వరుసగా ఇలాంటి లీకులు వస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement