ట్రెండింగ్‌లో 'లెజెండ్‌' ప్రభాస్‌ | Dhurandhar 2 Movie Director Aditya Dhar Calls Legend as Prabhas | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో 'లెజెండ్‌' ప్రభాస్‌

Apr 10 2026 2:17 PM | Updated on Apr 10 2026 2:33 PM

Dhurandhar 2 Movie Director Aditya Dhar Calls Legend as Prabhas

బాక్సాఫీస్ వద్ద  ‘ధురంధర్ 2’ ట్రెండ్‌ కొనసాగుతూనే ఉంది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తాజాగా  టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్‌, దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాలో చూశారు. ఈ క్రమంలో వారిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో ధురంధర్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌ కూడా స్పందించారు. ప్రభాస్‌, సందీప్‌ రెడ్డివంగాకు ధన్యవాదాలు తెలిపారు.

ధురంధర్‌-2 చిత్రాన్ని చూసి మెచ్చుకున్న ప్రభాస్‌పై అదిత్య ధర్‌ ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ ఒక లెజెండ్‌ అంటూ కొనియాడారు. ఈ వ్యాఖ్యలను ఫ్యాన్స్‌ త్వరగా వైరల్‌ చేశారు. సినిమాలో ఎక్కువగా కల్పిత అంశాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు విమర్శలు వస్తున్న సమయంలో 'ధురందర్ 2'కు మద్దతు ఇచ్చినందుకు సందీప్ రెడ్డి వంగాను కూడా ఆదిత్య ధర్ అభినందించారు. ప్రభాస్‌ను "లెజెండ్" అని సంబోధిస్తూ ధర్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించాయి. అప్పటి నుండి ఈ పదం అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. 'బాహుబలి' నుండి తన ఇటీవలి ప్రాజెక్టుల వరకు, ప్రభాస్ పాన్-ఇండియా స్థాయిలో ఎవరికీ అందనంత ఆదరణను సంపాదించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement