రణ్‌వీర్‌సింగ్ దురంధర్ చిత్రంపై ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు షామా మహమ్మద్ ప్రశంసలు కురిపించారు. దురంధర్ పార్ట్-1 నిన్ననే చేశానని తెలిపారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఆదిత్య ధర్ దర్శకత్వం అంటే చాలా ఇష్టమని ట్వీట్ చేశారు. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ అద్బుతంగా నటించారని రాసుకొచ్చారు. ఈ మూవీని తెరకెక్కించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఎలాంటి ప్రాపగండ లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ మూవీలో ఏ వర్గం వారిని చెడుగా చూపించలేదని షామా ట్విటర్‌లో తెలిపారు. కేవలం పాకిస్తాన్‌లోని పరిస్థితులను.. అక్కడున్న స్థానికుల గురించి మాత్రమే ఈ చిత్రంలో చూపించారని ఆమె అన్నారు. అక్కడి వాటిని మన ఇండియాలో ఉన్నవారితో పోల్చి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ షామా మహమ్మద్‌పై ఒక్కసారిగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇచ్చిపడేసింది. ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించగా సరైన సమాధానమిచ్చింది.
ఎవరైనా ఈ మూవీలో ప్రాపగండ ఉందనుకుంటే అలాంటి వాళ్లు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చని షామా మహమ్మద్ సలహా ఇచ్చింది. వెంటనే ఆ దేశ పౌరసత్వానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఎక్కడా కూడా ముస్లిం వర్గాన్ని చెడుగా చూపించలేదని.. పాకిస్తానీలను మాత్రమే చూపించిందని తెలిపింది. ఇక్కడివాళ్లంతా కలిసి ఇండియన్ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. ఓ కాంగ్రెస్ లీడర్ దురంధర్ సినిమాను ప్రశంసించడంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
కాగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ గతేడాది డిసెంబర్‌లో రిలీజైంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను షేర్ చేస్తూ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్-2 మార్చిలో రిలీజైంది. ఈ సినిమా ఏకంగా రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ రెండు సినిమాలు కలిసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఇందులో రణ్‌వీర్ సింగ్.. హంజా అలీ మజారీ అనే అండర్‌కవర్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు.
It did not show Muslims in bad light but Pakistanis in bad light ! Shame on you for confusing the two. People like you spoil the name of Muslims in India. You are most welcome to leave India & take the citizenship of Pakistan https://t.co/dpNypFQ9VM
— Dr. Shama Mohamed (@drshamamohd) May 7, 2026


