ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్‌లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.
దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్‌వీర్‌సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్‌లో నటిస్తే? 💀🔥
— Tupaki (@tupaki_official) March 21, 2026


