ధురంధర్‌-2పై విరాట్‌ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్‌ | Virat Kohli And Anushka Sharma Review On Dhurandhar 2 Movie | Sakshi
Sakshi News home page

ధురంధర్‌-2పై విరాట్‌ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్‌

Apr 7 2026 11:05 AM | Updated on Apr 7 2026 11:18 AM

Virat Kohli And Anushka Sharma Review On Dhurandhar 2 Movie

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధరంధర్‌-2 చిత్రాన్ని టీమిండియా క్రికెటర్‌ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్‌ను ఆదిత్య ధర్‌ షేర​్‌ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.

ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్‌ దంపతులు తెలిపారు.  ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు.  సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్‌.. ప్రత్యేకంగా రణ్‌వీర్‌ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్‌ ఒక జీనియస్‌ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్‌పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్‌ చేశారు.  జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్‌వీర్‌ను ప్రశంసించారు.

అయితే, విరాట్‌ దంపతులు చేసిన పోస్ట్‌లపై ఆదిత్య ధర్‌  ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్‌ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు.   విరాట్‌ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్‌కు వీరాభిమానిని ఆదిత్య ధర్‌ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్‌లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు.  అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement