ఆదిత్య ధర్‌కు పాకిస్తాన్‌ ప్రజల వింత డిమాండ్‌ | Lyari locals make funny demands to Dhurandhar 2 director Aditya Dhar | Sakshi
Sakshi News home page

ఆదిత్య ధర్‌కు పాకిస్తాన్‌ ప్రజల వింత డిమాండ్‌

Mar 27 2026 1:25 PM | Updated on Mar 27 2026 1:36 PM

Lyari locals make funny demands to Dhurandhar 2 director Aditya Dhar

రణ్‌వీర్‌ సింగ్‌- ఆదిత్యధర్‌ కాంబినేషన్‌ సినిమా ‘ధురంధర్‌2’ హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన  ‘ధురంధర్‌-1’ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.  ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీ  కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్‌ గురించి పాక్‌స్తాన్‌లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్‌ అవుతుంది.

ధురంధర్‌-2 కలెక్షన్స్‌పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా  కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్‌-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.

ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement