'అకౌంట్‌లో 84 రూపాయలు.. ఆటో ఛార్జీకి కూడా డబ్బుల్లేవ్' | Dhurandhar Actor Gaurav Gera survived struggle days in his Career | Sakshi
Sakshi News home page

Dhurandhar Actor: 'అకౌంట్‌లో 84 రూపాయలు.. ఆటో ఛార్జీకి కూడా డబ్బుల్లేవ్'

Jun 2 2026 6:38 PM | Updated on Jun 2 2026 7:01 PM

Dhurandhar Actor Gaurav Gera survived struggle days in his Career

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ దురంధర్. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ మూవీస్‌ ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రాల ద్వారా ఎంతోమంది నటులు ఫేమస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా దురంధర్‌ మూవీతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ మూవీతో ఫేమస్ అయిన నటుడు గౌరవ్ గెరా తన లైఫ్‌ గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.

ముంబయిలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని గౌరవ్ గెరా వెల్లడించారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఎదురైనట్లు వివరించారు. తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ. 84 మాత్రమే ఉన్న రోజులను గుర్తుచేసుకున్నారు. ఆటో ఛార్జీకి కూడా డబ్బులు చెల్లించలేక రోజు చాలా దూరం నడిచి వెళ్లేవాడినని తెలిపారు. 'ధురందర్: ది రివెంజ్ సూపర్ హిట్‌ కొట్టినా.. ఆ కష్టకాలం తనను ఎలా ఒదిగి ఉండేలా చేసిందన్నారు.

తన తండ్రి మద్దతుగా నిలిచారని గౌరవ్ గెరా గుర్తు చేసుకున్నారు. మా నాన్న జీతం తీసుకునే ఉద్యోగి.. ఆయన ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయని.. వాటిలో రూ. 2,000 పంపిస్తున్నాను.. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని రాసి ఉండేదని గెరా తెలిపారు. కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు అవి తనకు ఎప్పుడూ పెద్ద భారంలా అనిపించలేదన్నారు. ఆటోకు డబ్బులు లేనప్పుడు.. తాను నడిచి వెళ్లడానికే ఇష్టపడేవాడినని తెలిపారు. తాను ఎప్పుడు తీసుకునేవాడిగా కాకుండా.. ఇచ్చేవాడిగా ఉండాలనుకున్నానని పేర్కొన్నారు.

కాగా.. ధురంధర్ ఫిల్మ్ సిరీస్‌లో గౌరవ్ గేరా.. మహమ్మద్ ఆలం (ఆలం భాయ్‌)గా నటించారు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, మానవ్ గోహిల్, డానిష్ పండోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ స్పై థ్రిల్లర్ సిరీస్‌ సినిమాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement