టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తెలుగులోనూ ప్రీమియర్స్ | Dhurandhar The Revenge Premires in Telugu and tamil also this night | Sakshi
Sakshi News home page

Dhurandhar The Revenge: దురంధర్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తెలుగులో ప్రీయమిర్స్

Mar 18 2026 8:56 PM | Updated on Mar 19 2026 1:17 PM

Dhurandhar The Revenge Premires in Telugu and tamil also this night

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్‌ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్‌ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‍అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.

గతేడాది రిలీజైన దురంధర్‌ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్‌ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. 

t
 

Advertisement
 
Advertisement
Advertisement