'ఎండు మిర్చి ఒక్కటే సరిపోదు.. మొత్తం తగలబెట్టేయాల్సిందే'.. సందీప్ రెడ్డి కౌంటర్ | Sandeep Reddy Vanga Tweet On Dhurandhar 2 movie critisism | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: 'ఎండు మిర్చి ఒక్కటే సరిపోదు.. మొత్తం తగలబెట్టేయాల్సిందే'.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్

Apr 9 2026 9:36 PM | Updated on Apr 9 2026 9:36 PM

Sandeep Reddy Vanga Tweet On Dhurandhar 2 movie critisism

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న దురంధర్‌ మూవీపై టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నిన్న రాత్రి ఈ సినిమా చూశానని.. చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో విమర్శకులపై తన స్టైల్లో ఇచ్చిపడేశారు. రచయితలు, నటులు అనేవాళ్లు ప్రాపగండతోనే తమ కెరీర్ నిర్మించుకున్నారని.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ మాత్రం పిల్లుల్లా సైలెంట్ అయిపోయిందన్నారు.

ఇప్పుడదే వర్గం దురంధర్‌ను ఎగతాళి చేస్తోందని సందీప్ రెడ్డి వంగా విమర్శించారు. మీ మొదటి ప్రవృత్తి ఎగతాళి చేయడమే అయితే.. మిమ్మల్ని మీరు ఉదారవాదులు అని పిలిపించుకోలేరని రాసుకొచ్చారు. నిజానికి ప్రాపగండ అనే ముద్ర ఎప్పుడు పడిందో తెలియదన్నారు. ఈ విషయంలో ఆదిత్య ధర్‌, రణ్‌వీర్ సింగ్‌కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. దురంధర్‌ మూవీకి ఈ నల్ల దృష్టి ఇలా వెళ్లదు... గుప్పెడు మిరపకాయలతో పని జరగదు.... మొత్తం పొలం తగలబెట్టాల్సిందే అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాగా.. కొందరు దురంధర్ రిలీజైనప్పటి నుంచి ప్రాపగండ ముద్ర వేస్తూ విమర్శలు చేస్తున్నారు. వారికి తన ట్వీట్‌తో ఇచ్చిపడేశారు యానిమల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో స్పిరిట్ అనే మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్‌ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement