'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు? | Ram Charan as Ashwatthama with Aditya Dhar in Talks | Sakshi
Sakshi News home page

'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు?

Apr 6 2026 11:50 PM | Updated on Apr 6 2026 11:53 PM

Ram Charan as Ashwatthama with Aditya Dhar in Talks

బాలీవుడ్‌లో రాబోయే భారీ ప్రాజెక్టులపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’తో బిగ్ హిట్ అందుకున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్. కొంతకాలం క్రితం ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే కథను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో జియో స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే ఆ సమయంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు రామ్‌చరణ్ పేరు బలంగా వినిపించింది. అప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో ఆయనపై బాలీవుడ్ దృష్టి పడింది. అశ్వత్థామ పాత్రకు చరణ్ సరైన ఎంపిక అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.  

అయితే ఇప్పుడు మళ్లీ ఈ కథపై చర్చలు మొదలయ్యాయి. దానికి కారణం.. ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ. ధురంధర్ చిత్రం రెండు భాగాలతో భారీ విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్‌పై నిర్మాణ సంస్థలు నమ్మకం పెంచుకున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  మెగా ఫ్యాన్స్ మాత్రం అప్పటి పుకారు ఇప్పుడు నిజమవ్వాలని కోరుకుంటున్నారు. రామ్‌చరణ్ ఈ ప్రాజెక్టులో భాగమైతే, బాలీవుడ్‌లో మరో భారీ అడుగు వేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement