ధురంధర్‌ దర్శకుడి కొత్త సినిమా.. బిగ్‌ ప్లాన్‌తో ఆదిత్య ధర్‌ | Ranveer Singh And Aditya Dhar Team Up Again For High Scale Spy Thriller Set For 2027 After Dhurandhar | Sakshi
Sakshi News home page

ధురంధర్‌ దర్శకుడి కొత్త సినిమా.. బిగ్‌ ప్లాన్‌తో ఆదిత్య ధర్‌

Apr 29 2026 8:10 AM | Updated on Apr 29 2026 10:38 AM

Ranveer Singh And Aditya Dhar again One Movie After Dhurandhar

‘ధురంధర్‌’ ప్రాంఛైజీ చిత్రాలతో  రణ్‌వీర్‌ సింగ్‌- దర్శకుడు ఆదిత్య ధర్‌ బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేశారు. సుమారు రూ. 3వేల కోట్లకు పైగా ఈ రెండు సినిమాలు కలెక్షన్స్‌ రాబట్టాయి. ఇండియన్‌  మూవీ మార్కెట్‌లోనే అనేక సంచలనాలను క్రియేట్‌ చేసిన వీరిద్దరూ మరో సినిమా కోసం పనిచేయనున్నారు. ఈమేరకు బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి.

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్‌ మరో కథను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో వస్తున్న కథనాల ప్రకారం దర్శకుడికి ఒక కొత్త ఆలోచన తట్టిందని ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను మరింత బలంగా ఉండేలా తన పనిని ప్రారంభించారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్ట్ 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుపుతున్నారు.  భారతదేశ భద్రత, నిఘా, అంతర్గత/బాహ్య వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పలు ఇంటలిజెన్స్ (నిఘా) సంస్థలు దేశం కోసం పనిచేస్తున్నాయి. మరోసారి దేశం కోసం పనిచేసే సైనికుడి పాత్రతోనే ఒక బలమైన స్టోరీని ఆయన ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవ ప్రపంచానికి దూరంగా.. ఒక భారీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రణవీర్ సింగ్ దాదాపు నటించనున్నారని టాక్‌ ఉంది. ప్రస్తుతానికి పూర్తి నటీనటుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు.  త్వరలో ఆయన మరిన్ని విషయాలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement