దురంధర్‌-2ను వదలని పైరసీ.. యూట్యూబ్‌లో ప్రింట్..! | Ranveer Singh Dhurandhar 2 YouTube Piracy Link Removed After Fans Alert On Social Media, Read Story For More Details | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్‌-2ను వదలని పైరసీ.. యూట్యూబ్‌లో ప్రింట్..!

Mar 31 2026 1:45 PM | Updated on Mar 31 2026 2:02 PM

Dhurandhar 2 YouTube link removed after fans alert On Social Media

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్‌-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్‌ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్‌ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. దీంతో  వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేశారు.

d

కాగా.. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement